ఈ మధ్య పనుల్లో పడి నన్ను నేను మర్చిపోయానంటే నమ్మండి,ఇక బ్లాగు సంగతి చెప్పేదేముంది!రెండు నెలలు పైనే అయ్యింది ,బ్లాగు వంక చూసి ,అమ్మో! ఇలా అయితే నా బ్లాగు కనుమరుగైపోతుందన్న భయంతో ఏదో ఒకటి పోస్టు చేయాలన్న ప్రయత్నమన్నమాట ఇది .ఇదివరకు ఏదో బ్లాగులో చదివి ,చిలకడదుంపను మొలకెత్తించే కార్యక్రమం లో విఫలమయ్యాను.
ఈసారి గ్రాండ్ సక్సెస్ కదండీ !అందుకే మీకూ చూపించి , నాలుగు కామెంట్లు కొట్టేద్దామని ఆశ.అన్నట్టు ఈ చెట్టు ?వయస్సు 23రోజులు.కప్పులో నీళ్ళు పోసి దుంప సగం ములిగేలా పెట్టానంతే!ఇంట్లోనే.రెండు రోజుల కోసారి నీళ్ళు మారుస్తున్నాను. పనిలో పని మా పెరట్లో కాసిన కాకరకాయలు కూడా చూసేయండి.
బ్లాగు గుర్తువచ్చినందుకు ధన్యవాదాలు.ఇది మొక్క కాదు తీగలాగా పాకుతుంది నేలలో వేయండి, బాగా వస్తుంది, నేను వేశాను.కాకరకాయలు బాగున్నాయి.ఇవి కొంచం చేదు తక్కువ.
LikeLike
బాబాయ్ గారూ !నమస్తే .బాగున్నారా? మీ ఆరోగ్యం కుదుటపడినందుకు సంతోషం .ఎక్కువ శ్రమ తీసుకోకుండా చిన్న చిన్న టపాలు పెట్టమని నా విజ్ఞప్తి.ఇల్లుకట్టి చూడు అనే పెద్దల మాట అక్షరాలా అనుభవంలోనికి వస్తుంది .అస్సలు ఖాళీ దొరకడం లేదు .నా ప్రతీ పోస్టు తప్పక చదివి ,కామెంట్ పెడతారు మీరు ,చాలా సంతోషం .

wow nice
LikeLike
Thank you ఎన్నెల గారూ! నా బ్లాగుకు స్వాగతమండీ!
LikeLike