నేనూ బ్లాగర్నేనా?

 ఇట్లా  తెలుగులో కూడా బ్లాగ్లు ఉంటాయని కొన్ని నెలల క్రితమే ఈనాడు వారి తెలుగువెలుగు పుస్తకం ద్వారా తెలుసుకొని అపుడపుడు చూడడం మొదలుపెట్టాను .ముందుగా  తెలుగువేలుగుకు ధన్యవాదములు .సరిగ్గా నెల క్రితం నుండి వ్యాఖ్యలు వ్రాయడం ప్రారంభించా.నా వ్యాఖ్యలకు జవాబులు కూడా వస్తుంటే చాలా ఉత్సాహంగా అన్పించింది.మొదట్లో అందరికీ ఇల్లాగే ఉంటుందా?
నా వ్యాఖ్యకు జవాబిస్తూ ,వనజవనమాలి గారు ఇట్లా అన్నారు.”మీరు కూడా మీకు తోచినది వ్రాస్తూ ఉండండి.”ఆవిడ ప్రేరణ, మా అబ్బాయి సహకారం తో వ్రాయడం మొదలు పెట్టాను.మొదట్లో మావారు నీ బ్లాగ్ ఎవరు చూస్తారు?అన్నారు”ఎవరూ చూడక పోయినా పర్వాలేదు,నేను డైరీ వ్రాకుంటున్నాను,” అసుకుంటాను, అన్నాను. ఇపుడు .నేను కీ బోర్డు తో కుస్తీలు పడుతుంటే ,పాపం  భోజనం తనే వడ్డించుకొని తింటున్నారు .అంతే కాదండీ,నాలుగు రోజులుగా నా బ్లాగ్ చూస్తున్నారు కూడా.
ఎప్పటి కైనా కూడలి లోకి అడుగుపెట్టాలి. అప్పుడే నేను బ్లాగర్ అయినట్టు.ఇదండీ నా బ్లాగాయణం .
                                             

   
                               

6 Comments

  1. నాగరాణి గారూ,తెలుగులో బ్లాగు రాస్తున్నవారు ఎవరైనా సరే తమ బ్లాగుని కూడలి, మాలిక, జల్లెడ, హారం లాంటి బ్లాగు ఆగ్రిగేటర్లలో చేర్చవచ్చు. మీరు చెయ్యాల్సిందల్లా వారి మెయిల్ ఐడీకి మీ బ్లాగు లింకుతో సహా వివరాలు ఇస్తూ ఒక విన్నపం పంపడమే. ఒకసారి వారు మీ బ్లాగుని ఆగ్రిగేటర్లో కలిపాక మీరు కొత్త పోస్టు వేసినప్పుడల్లా అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీరే ఆ పని చెయ్యవచ్చు. కూడలిలో మీ బ్లాగు ఎలా వస్తుందో అని ఎదురుచూడాల్సిన అవసరం లేదు. తెలుగులో బ్లాగు రాసేవారందరూ తెలుగు బ్లాగర్లే! :)ఈ లింకుల్లో ఉన్న సమాచారాన్ని ఒకసారి చూడండి.http://koodali.org/addhttp://maalika.org/add_your_telugu_blog_to_maalika.php

    Like

  2. మీరు బ్లాగరే. ఎవర్నైనా కాదనమండి:) మీ జొన్న వంటకాలు, పొలాలు, పూలు-తోటలు, మీ బొమ్మలూ…అన్నీ అన్నీ ఎంతో బాగున్నాయి.All the best.

    Like

  3. మధురవాణి గారూ ! ముందుగా మీకు ధన్యవాదాలు . నాకు .విలువైన సూచనలు .చిరునామా లు ఇచ్చినందుకు .మీలాగే మరో మిత్రురాలు ఇచ్చిన సూచన .మేరకు .హారం లో చేరాను .నెమ్మదిగా మిగతావన్నీ .

    Like

  4. చాలా చాలా ధన్యవాదాలు జయగారూ! నాటపాలన్నీ ఓపిక గా చూసనందుకు .అన్నీ మీకు నచ్చినందుకు .మీ ప్రోత్సాహం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది .

    Like

  5. మన ఆలోచనలు ఇంతకూ ముందు పేపర్ పై వ్రాసేవాల్లము .ఇప్పడు బ్లాగ్ లో వ్రాస్తున్నాము. కొనసాగించండి .

    Like

Leave a reply to nagarani yerra Cancel reply