ఈ ఫోటో ల్లో ఉన్నది మొగలిపూవు .పల్లెటూరు లో పుట్టి పెరిగిన వారికి ఈ సంగతి తెలుసు ,కానీ ,నగరవాసులకు తలియకపోవచ్చు,అనుకుంటున్నాను .నగరాల్లో ఉండే బ్లాగు మిత్రులకు,దీన్ని పరిచయం చేద్దామని నా ప్రయత్నం . ఈ మధ్య మాఊరు ఉండి వెళ్ళి వచ్చాం . అక్కడి నుండి తెచ్చాను .ఈపూవు ఇంట్లో ఉంటే ఇల్లంతా సువాసనాభరితం .సహజసిధ్ధమైన రూమ్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది .పైన ఉండే రేకులు బిరుసుగా ముళ్ళతో ఉంటాయి కానీ లోపల రేకులు మృదువుగా మంచి సువాసనతో ఉంటాయి . ఈరేకుల్ని విడిగా తీసి చిన్న చిన్న రింగులుగా చుట్టి పూలజడ కుడతారు .ఈపూవు మొత్తం అట్లాగే బట్టల బీరువాలో పెడితే ,సువాసన బట్టలకు పడుతుంది . నేను అందుకే తెచ్చాను మరి .
“విరిసే విరిసే మొగలిరేకులు”అని సీరియల్ టైటిల్ సాంగ్ విన్నారు కదా!ఇపుడు మొగలిపూవును కూడా చూసేశారు .వాసన చూపించడం మాత్రం నాకు వీలుకాదు కదండీ!సారీ!
మొగలి పూవు .
చిత్రాలతో కూడిన పరిచయం బాగుంది .
LikeLike
ధన్యవాదాలు శర్మ గారూ ! నేనూ ఇప్పుడే మీ టపా చదివి వ్యాఖ్య పెట్టాను .
LikeLike
నేను మొగలి పువ్వు గురించి వినటమే కాని చూడటం ఇదేనండి. ఫోటోలు బాగున్నాయి. ఇది ఎన్ని రోజులు వాడకుండా (ఎండిపోకుండా) ఉంటుందో!
LikeLike
ధధన్యవాదాలు సిరిసిరిమువ్వ గారూ . ఇది మూడు నాలుగు రోజులు ఉంటుంది .
LikeLike
భలే గుర్తు చేసారు. ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు. నా చిన్నప్పుడు హైదరాబాదులో బడీ చౌడీలో, కోఠీ జైన్ మందిర్ ఎదురుగా ఈ పూలు దొరికేవి. వీటితో నాకు చాలా సార్లు పూలజడలు కూడా వేసారు. (అప్పుదు జుట్టు బాగా ఉండేది). మేమూ ఎండిన వాటిని బట్టల్లోనూ, పుస్తకాల్లోనూ దాచుకునేవాళ్ళం.
LikeLike
ధన్యవాదాలు అనూ గారూ . నా బ్లాగు చూసి మీ బాల్యం గుర్తు కొచ్చినందుకు సంతోషం .
LikeLike
Rani garru.. chakkagaa Mogalipoovunu choopinchaaru. Thank you so much.
LikeLike
ధన్యవాదాలు వనజ గారూ ! మీ అందరి స్పందన చూసి నాకూ చాలా సంతోషంగా ఉంది
LikeLike
నాకు వాసన కుడా వస్తుంది .ఆవాసన నాకు తెలుసు ,చిన్నప్పుడు బాగా చుసేదానిని ఇప్పుడు దొరకట్లేదు
LikeLike
మొగలి పువ్వు అద్భుతమైన సువాసన. ఇప్పటికీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక సీజన్లో బాగా అమ్ముతారు ఈ పువ్వు. మొగలి పొదల్లో పాములు ఉంటాయంటారు అందులో నిజమెంతో తెలియదు.
LikeLike
నాకు ఈ పువ్వంటే పిచ్చ ఇష్టం ఈ మొగలి పువ్వు ఇప్పటికీ హైద్రాబాద్ లో దొరుకుతోంది , మోండా మార్కెట్ , కోఠీ ఈ రెండు ప్రాంతాల్లో వెతకండి దొరుకుతుంది , పువ్వు ఖరీదు దాదాపు 60-200 వరకు చెప్తారు , మొగలి అంటే ప్రేమ ఉన్నవారు ఖరీదుని ఎలా కాదనగలరు …:) ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా దొరుకుతాయ్
LikeLike
హలో రాధిక గారూ !మీరుండేది పల్లెటూరు అన్నారు కదండీ !అక్కడ దొరకాలే మొగలిపువ్వు .
LikeLike
ప్రయగారూ!హైదరాబాద్ లో అంతఖరీదు ఉంటుందా? నేను భీమవరం నుండి జత50రూపాయలకు తెచ్చాను .అన్నట్లు మేము మల్కాజిగిరి లో ఉంటాము .మీరుండేది ఎక్కడ ?
LikeLike