మా వాకిట్లో నారింజచెట్టు కొమ్మల్లో చిన్న పిట్ట కట్టిన గూడు చూడండి .ఎంత బావుందో! పక్షి గూడు చూసినప్పుడల్లా దాని నైపుణ్యం చూసి,అది దానికి ఎలా సాధ్యం అవుతుందా అనిపిస్తుంది . ఆ పిట్ట పరిమాణంలో పిచ్చుక కన్నా చాలా చిన్నగా ఉంది . చాలా రోజులుగా దానిని ఫోటో తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను .అది నాకు .కుదరడం లేదు . ఇప్పుడు దాని ఇల్లు తీసాను .భవిష్యత్తులో దాన్ని పిల్లల్ని కూడా చూపిస్తాను .పిట్ట చిన్నదే కానీ గుడ్లు మాత్రం చిన్న చిన్న రేగుపండ్ల లాగా ఉన్నాయి . ఈ పిట్ట ఇంటి అడ్రస్ కనిపెట్టింది మాత్రం నేను కాదండీ! మా వారు
పిట్ట కొంచెం గుడ్డు ఘనం
Bagundi…Ranigaru
LikeLike
ధన్యవాదాలు అహ్మద్ చౌదరి గారూ .
LikeLike
Very cute.చాలా బావుంది మీ పిట్ట గూడు. ఉగాది అప్పుడు మా మావిడి చెట్టు మీద ఇలానే పిట్ట గూడు కట్టింది. నేనూ ఫొటోలు తీసి బ్లాగులో పెట్టాను.
LikeLike
ధన్యవాదాలు అనూగారూ .నేను కూడా మీ\”ఉగాది అతిథి \” ని చూసాను . బావుంది . నేనూ మీ బ్లాగులు వరుసగా ఒక్కటే చదువుతూ ఉన్నాను .బాగా .వ్రాసారు .మనమిద్దరం ఇంచుమించు ఒకే సారి బ్లాగు వ్రాయడం మొదలు పెట్టామనుకుంటున్నాను .మీ బ్లాగు డిజైన్ బాగుంది .
LikeLike
aasakti gaa uMdi.. pIttani kooDaa paTTi choopaMDi. bujji pillala kOsaM eduru choostoo..
LikeLike
This comment has been removed by the author.
LikeLike
నాగరాణి గారు బాగున్నారా . మీరు పోస్ట్ చేసిన పిట్టగూడు చూసాను . బాగుంది . నాబ్లాగులో ఒక పిట్ట ఫోటో పెడతాను అదేనేమో చూడండి .
LikeLike
తల్లీ పిల్లల ను మీకందరికీ చూపాలనే నా తాపత్రయం .జూమ్ చేసే వీలున్న కెమెరా తో ప్యత్నంచాలి .త్వరలోనే చూపిస్తా వనజ గారూ .
LikeLike
బాగున్నాను మల్లి గారూ . మీరుబాగున్నారా? మా పిట్ట అది కాదండీ! అది ఇంకా చిన్న గా ఉంటుంది ,పైన అంతా నలుపు, పొట్ట కాళ్ళు లేత పసుపు రంగు .ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది . ఎట్లాగైనా సరేప్యత్నంచి నేనే మీకందరికీ చూపిస్తాను .
LikeLike
ఫోటోలు తియ్యడానికి చాలా కష్టపడి ఉంటారు. బాగున్నాయి.
LikeLike
ధన్యవాదాలు వర్మ గారూ . ఇవి తీయడం కష్టం కాలేదు .తక్కువ ఎత్తులోనే గూడుకట్టింది .పిట్టే దొరక్కుండా తిప్పలు పెడుతుంది .
LikeLike
అబ్బ ఎంతబాగుందో పక్షిగూడు , బహుశా ఇది weaver bird ది ఏమో , చాలా బాగుంది
LikeLike
అవును ప్రియ .గారూ అది weaver bird కావచ్చు . ఎందుకంటే చెట్టు ఆకుల్ని ఆకుల్ని ప్లాస్టిక్ దారంతో గూడుకు కలిపి .కుట్టేసింది నిజంగా .ఆశ్చర్యపోయాము
LikeLike