పదిహేను రోజులుగా మాకు మంచి కాలక్షేపం కలగచేసిందండీ,మా పెరట్లోని పిట్టగూడు .ఇవ్వాల్టితో కథ సుఖాంతమైపోయింది .ఈరోజు ఉదయం మూడు పిట్టలు బైటకు వచ్చి కిందా మీదా పడుతూ లేస్తూ,చివరకు హాయిగా గాల్లోకి ఎగిరిపోయాయి .ఒకటి మాత్రం కొంచెం బలహీనంగా ఉంది . ఇంకా ఎగరలేకపోతుంది . ప్రయత్నం చేస్తుంది ,కానీ పడిపోతుంది . తల్లి దానికి ఇంకా ఆహారం పెడుతూనే ఉంది .మేము .అది ఎట్లా ఉందో చూద్దామని దగ్గరకువెడితే అరచి అరచి గోల చేస్తుంది . దాని పిల్లను ఏం చేసేస్తామోనని దాని భయం . ఈరోజు ఉదయం వాటిని చూస్తూ బాగా .ఎంజాయ్ చేసాము .మరలా రాదు కదా!అలాంటి అవకాశం . రోజూ వాటిని .ఉదయాన్నే లేచి చూసి నాలుగూక్షేమంగానే ఉన్నాయని,హమ్మయ్య!అనుకోవడం ఎందుకంటే రాత్రి .పూట ఏ పిల్లైనా వాటిని భోంచేసేసిందేమోనని,భయం .మన ఎదురుగా అట్లా జరిగితే .బాధ కదండీ!ఉదయాన్నే .లేచి చూస్తే ఎప్పటిలాగానే నాలుగూ ఒకదానిమీద ఒకటి పడుకొనే ఉన్నాయి ,సర్దుకుపోదాం రండి!అన్నట్లుగా .అరగంట తర్వాత వచ్చి చూస్తే మూడు పిల్లలు ఒకే కొమ్మ మీద పక్క పక్కనే చాలా ముద్దుగా ,బుధ్ధిగా కూర్చుని ఉన్నాయి ,మీరూ చూడండి . అక్కడి నుండి మొదలు .అవి ఎగరడానికి ప్రయత్నం చేయడం ,పడిపోవడం .కేండీ వచ్చి .ఎక్కడ పట్టుకొంటుందోనని మా భయం . మేము .వాటిని .తీసి గూట్లో పెడుతుంటే వాటి తల్లి గోల .వచ్చీరాని నడకతో పడిపోయి దెబ్బలు తగిలించుకునే చంటిపిల్లల మాదిరిగా ,అవి కష్టపడి .ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు మారుతూ ,అక్కడ విశ్రాంతితీసుకుని నెమ్మదిగా .అలా అలా ఎగిరిపోయాయి .
హమ్మయ్య ! పిట్టపిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయోచ్!
చాలా బావున్నాయి రాణి గారు , పిట్ట పిల్లలతో బాగా Enjoy చేసారు అయితే … 🙂 బావుందండి మీ బ్లాగు ,మీకు వీలున్నప్పుడు మా బ్లాగును కూడా ఒక చూపు చూడండి 🙂 , మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి .ధన్యవాదాలు ,techwaves4u.blogspot.inతెలుగు లో టెక్నికల్ బ్లాగు
LikeLike
రోజూ వాటిని చూసి వాటిపట్ల ప్రేమ పెరిగి అవి ఎగిరిపోయాక కొన్నిరోజులపాటు ఏమీ తోచడుకదా !!
LikeLike
నమస్తే ఛాయ గారూ .నా బ్లాగు చూసినందుకు సంతోషం . మీరు చెప్పినది నిజమేనండీ!ఒక రోజంతా అలాగే అన్పించింది .కానీ అది ప్రకృతి సహజం కదా!మరలా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి లెండి .
LikeLike
బుజ్జి పిల్లలు బాగున్నాయి . గూడు అలాగే వుంచండి ,మళ్లీ పిట్ట గుడ్లు పెడుతుందేమో చూడండి .
LikeLike
ధన్యవాదాలు మల్లి గారూ . గూడు అట్లాగే ఉందండీ .చాలా పకడ్బందీగా కట్టింది .కానీ ఒకసారి పెట్టిన దాంట్లో మళ్ళీ పెడుతుందా?చూడాలి .
LikeLike
అబ్బా ..ఎంత బుజ్జిగా ,ముద్దుగా ఉన్నాయో …
LikeLike
ప్రియ గారూ !బుజ్జిపిట్టలు ఇంకా మాచెట్ల మీదే తిరుగుతూ మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి .ఇప వాటికి .తోకలు వచ్చేసినయ్ .బొద్దుగా తయారైనవి .
LikeLike
very cute…
LikeLike
అనూ గారు ధన్యవాదాలు . మీరు చాలా ఆలస్యం గా చూసారు బుజ్జిపిట్టల్ని .మళ్ళీ ఇంకోసిరీస్ కూడా మొదలైంది . మళ్లీ గూడు కట్టేసి అట్లాగే నాలుగు గుడ్లు పెట్టింది .ఇవాళో రేపో బైటకొచ్చేస్తాయి .అందంగా తయారై ఎగరడానికి ఇంకో వారం పడుతుంది . చూస్తూ ఉండండే .
LikeLike