ఏదైనా సలహా చెప్పండి .

చెట్లు పెంచడంలో ఆసక్తి ఉన్న బ్లాగు మిత్రులు ఎవరైనా నా యొక్క ఈ సమస్య కు ఏదైనా సలహా చెబుతారని ఆశిస్తున్నాను . మా ఇంట్లో ఏడు సంవత్సరాల వయసు గల రెండు మల్లె చెట్లున్నాయి .అవి సరిగ్గా పూలు పూయడం లేదు . ఏ విధమైన పోషణ చేయాలి తెలియడంలేదు .ఏటా ఫిబ్రవరి లో ఆకు మొత్తం ఒక్కటి కూడా లేకుండా తీసేస్తున్నాము .ఆకు దూసిన తరువాత నీళ్ళు ఎక్కువ పెట్టకూడదని ఎవరో చెప్పారు . ఆ ప్రయత్నం కూడ అయ్యింది . ఏమీ గొప్ప ఫలితాలు రాలేదు .ఒకదానికి బాగా నీళ్ళు పెట్టి ,ఒకదానికి తగుమాత్రంగా పోసి చూసాను .ప్రయోజనం శూన్యం . సీజన్ మొత్తానికి ఒక వారం రోజులు 50నుండి100 పూలు పూసి ఆగిపోయింది . ఈమాత్రం దానికి గంటలు గంటలు కష్టపడి ,చేతులు నొప్పెట్టేలా ఆకు తీయడం వృధా అన్పిస్తుంది .మేము ఏ విధమైన ఎరువులు,రసాయనాలూ వాడటంలేదు .వాటి అవసరం లేకుండానే ,సన్నజాజి,విరజాజి విరగబూస్తున్నాయి .నేను వాటిని బ్లాగు లో కూడా పెట్టాను . వాటి లాగే మల్లెలు కూడా పూయాలని ఆశ .చెట్లు ఎప్పుడూ దట్టంగా ఆకులతో కళకళలాడిపోతుంటాయండీ,పూలు మాత్రం .సరిగా రావు .ఇప్పుడు సీజన్ అయిపోయింది ,అయినా విషయం తెలుసుకొని వచ్చే సంవత్సరం ప్రయత్నం చేద్దామని  నా ఉద్దేశ్యం .

15 Comments

  1. పూత అయిపోయిన తరవాత ఆకుదూసి దానినే గ్రీన్ మెన్యూర్ గా మొక్క మొదటిలో చుట్టూ గొయ్యితీసి ఆకు అందులో పూడ్చి కప్పేయండి, కొద్ది కొద్దిగా నీరుపోయండి. ఆకుకుళ్ళి ఎరువుగా మారుతుంది. అది చాలు.నేలలో తేడా ఏమయినా ఉందేమో గమనించండి.

    Like

  2. మల్లె చెట్టు ఏ నేలలో ఉన్నదో తెలియటం లేదు. నల్ల మట్టి తెప్పించి బాగా కుదురు చేసి అందులో ఈ నల్ల మట్టి వేసి నీళ్ళు పొయ్యండి. గుణం కనిపించవచ్చు. కాని ఒక సంగతి ఉన్నది. మల్లె చెట్లల్లోఏదో ఒక రకం ఎక్కువగా పూలు పూయదు. ఆ రకం అయ్యి ఉంటుంది మీ దగ్గర ఉన్నది. మీ చుట్టు పక్కల బాగా పూలు పూస్తున్న మల్లె చెట్టు తీగ ఒకటి అంటు కట్టి అది తీసుకువచ్చి మీ ఇంట్లో పెంచటం మొదలు పెట్టి చూడండి. ఆ మొక్క బాగా పూలు పూస్తుంటె, మునుపు ఉన్న మొక్క వరైటీ వేరు అయ్యి ఉండవచ్చు ఆ వెరైటీ పూల దిగుబడి 100 పూల లోపే అయ్యి ఉంటె ఏమి చేసినా ఉపయోగం ఉండదు.

    Like

  3. ధన్యవాదాలు కష్టేఫలి గారూ !తప్పకుండా మీసలహా పాటిస్తాను .ఇప్పుడు ఆకు దూసి చెట్టు కు ఎరువుగావేస్తాము,మీరు చెప్పినట్టుగానే . మల్లెల సీజన్ వచ్చే ముందు మరలా ఆకు దూయాల్సినఅవసరం ఉంటుందంటారా? మీ వంటి పెద్దలు స్పందించి సలహా ఇచ్చినందుకు చాలా .సంతోషంగా ఉంది

    Like

  4. స్పందించి సలహా ఇచ్చారు ,ధన్యవాదములు శివరామప్రసాదు గారూ .మేము హైదరాబాద్ లో ఉంటాం .ఎర్రమట్టి సన్నని గులకరాయితో కలసి ఉంటుంది .మీరు .చెప్పినట్టుగా ఆమొక్క తీరే అంతేనేమో .కొన్ని పూసినా పూలు చాలా పెద్దగా ఉంటాయి . సువాసన కూడా ఎక్కువ . దొంతరమల్లె .అందుకే ఇంకా .ఎక్కువ పూస్తే బావుంటుందని ఆశ .మరొక్కసారి ధన్యవాదాలు .

    Like

  5. అప్పుడూ ఆకు దూయాలి. ఆ ఆకును మొక్క మొదటిలో ఉంచెయ్యాలి, పారబోయద్దు.అలా ఉంచితే అదే మల్చింగ్ అనగా నీటి తడిని ఆరిపోనివ్వదు, నెమ్మదిగా ఆకు భూమిలో కలిసి ఎరువు. పురుగులు పట్టకుందా చూడాలి.

    Like

  6. ధన్యవాదాలు శర్మ గారూ . ఎంతో ఓపిక తో మరలా జవాబు ఇచ్చినందుకు .మీ సూచనలు తప్పక పాటిస్తాను .

    Like

  7. చెట్టు ఆకులతో పాటు గా కొమ్మలు కూడా కొంచం కొంచం కట్ చేయండి , రోజూ మనం పాడేసే కూరగాయల తొక్కలు అవీ మొక్క మొదట్లో వేస్తే అది ఎరువుగా పనికొస్తుంది ..

    Like

  8. మొక్క చూస్తే పందిరి మల్లె లా ఉంది , ఒక 6,7 కర్రలతో చిన్న పందిరిలా వేయండి , ఫలితం ఉండొచ్చు

    Like

  9. మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

    Like

  10. ధన్యవాదాలు ప్రియ గారూ . మీరు చెప్పినట్లే చేసి చూస్తాను .ఇక పందిరి విషయానికొస్తే వేయడానికి .స్థలం లేదండీ!మొక్క గోడ వారగా ఉంది . డాబా పైకి .ఎక్కిద్దామనుకున్నాము .అది ఎక్కలేనని ఆగిపోయింది .సన్నజాజి .,విరజాజి చక్కగా .ఎక్కేసి పూసేస్తున్నాయి .

    Like

  11. ధన్యవాదాలు అహ్మద్ చౌదరి గారూ . బ్లాగు వేదిక లోగోను త్వరలోనే అతికించుకోగలను .

    Like

  12. గౌరవనీయ నాగరాణిగారికి బ్లాగ్ వేదిక టీం విన్నపంతో వ్రాయునది.బ్లాగ్ వేదిక ప్రతినెలా ఒక బ్లాగరిగారితో ఇంటర్వూ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.ఆ ఇంటర్వూ మీతోనే ప్రారంభించాలని అనుకుంటున్నాము.దయచేసి మీకు అంగీకారమైతే మీ మెయిల్ ఐడిని మా మెయిల్ ఐడి md.ahmedchowdary@gmail.com కి పంపిస్తే ఇంటర్వూ షీట్ పంపించగలము.తెలుగు బ్లాగులను,బ్లాగర్లను ప్రపంచ తెలుగు ప్రజలకు తెలియచేయాలన్న తపన మాత్రమే అని గుర్తించగలరు.

    Like

  13. ఈసారి మొక్కని పొట్టిగా చెయండి. అంటే 3,4 అడుగులకి మించకుండా. సూర్యరశ్మి కొసం ఒకటి, రెండు కొమ్మలను వదిలేయండి. ఇదంతా జనవరిలో చేయండి.ఎండ బాగా తగిలేలా చూడండి.

    Like

  14. ధన్యవాదాలు కిరణ్మయి గారూ .మీ సూచన కాస్త విభిన్నంగా ఉంది ,ప్రొఫెషనల్ గా అన్పిస్తుంది .తప్పక .ప్రయత్నించి చూస్తాను . మీ బ్లాగు అడ్రెస్ .ఏమిటి ? మీ పేరు మీద క్లిక్ చేస్తే రావడం లేదు .

    Like

Leave a reply to kiranmai Cancel reply