ముగిసిన పెళ్లి సందడి.

మిత్రులందరికీ నమస్కారమండీ!అందరూ బావున్నారు కదండీ !చాలారోజులైపోయిందండీ బ్లాగులు చూసి .పెళ్ళి పేరుతో రెండు నెలలుగా మేము పడిన హడావిడి పూర్తి అయ్యింది .డిశంబర్ 12న మా అబ్బాయి వివాహం జరిగింది .డిశంబర్30న అబ్బాయి ,కోడలు, అమెరికా వెళ్ళి పోవడంతో ఒక్కసారిగా ఇల్లంతా చిన్నబోయింది.ఇల్లు సర్దుకోవడం పూర్తి కాగానే ,బ్లాగు గుర్తు కొచ్చేసి, ఇలా మీ ముందుకొచ్చేసానన్న మాట.ఇక మీకు తప్పదు మరి !మా అబ్బాయి పెళ్ళి ఫోటోలు చూడడం . పెద్దలందరూ చిరంజీవుల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను .

10 Comments

  1. అత్తగారైపోయారన్నమాట 🙂 అభినందనలు.మీ కొడుకు కోడలు ముచ్చటగా వున్నారు. ఇరువురికీ అభినందనలు , ఆశీర్వాదాలు.

    Like

  2. ధన్యవాదాలు నీరూ గారూ !నాబ్లాగుకు స్వాగతం .మీఅభినందనలు ,ప్రశంసలు,వాళ్ళకు అందజేస్తాను,ప్రత్యేకంగా మా కోడలికి.

    Like

  3. ధన్యవాదాలు ధాత్రి గారూ ! మీ అందరి అభినందనలు వారికి అందుతాయి.వాళ్ళు నా బ్లాగు చూస్తారు .

    Like

  4. మాలాకుమార్ గారూ ! నా బ్లాగు కు స్వాగతం .అవునండీ!నాకూ అలాగే అన్పిస్తుంది,అంతా కలలా అన్పిస్తుంది,ఆశీర్వాదాలు అందజేసినందుకు ధన్యవాదాలు .

    Like

Leave a reply to Niru Cancel reply