సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న మా ?

చూసారా ? మా వంటింట్లో మేము వాడుతున్న ఫ్రిజ్.దాన్ని కొని 25 సంవత్సరాలు పూర్తి అయ్యింది .ఎందుకో హఠాత్తుగా ఆవిషయం గుర్తు కొచ్చింది.ఫ్రిజ్ మా ఇంటికి రావడానికి కంటే ముందు పుట్టిన మా అబ్బాయి కి మొన్నీ మధ్యే పెళ్ళి అయ్యింది .విశేషమేంటంటే, మా ఫ్రిజ్ ఒక్కసారికూడా రిపేర్ కు వెళ్ళలేదు. ఈ 25 సంవత్సరాల లో మూడు సార్లు ఇళ్ళు కూడా మారాము,అయినా ఏ మాత్రం సమస్య లేకుండా పనిచేస్తూనే ఉంది .ఇంటికొచ్చే వాళ్ళందరూ అడుగుతుంటారు,మీరింకా ఈ ఫ్రిజ్ మార్చరా?అని.అది అంత బాగా పనిచేస్తుంటే,మార్చడమెందుకని?నా అభిప్రాయం .మీరేమంటారు?

4 Comments

  1. నమస్కారం పూర్ణప్రజ్ఞాభారతి గారూ !ముందుగా నా బ్లాగుకు స్వాగతం .మీ స్పందనకు ధన్యవాదాలు .

    Like

  2. నమస్కారం శశి గారూ !నా బ్లాగుకు స్వాగతం .మీ స్పందనకు ధన్యవాదాలు . ఫ్రిజ్ ఇన్ని రోజులు పనిచేయడం ఇంట్రెస్టింగే, కానీ ఇన్ని సంవత్సరాలు వాడటం మంచిదేనా అన్న సందేహం కూడా వస్తుంటుంది అప్పుడప్పుడూ .

    Like

Leave a reply to sasi Cancel reply