తల్లీ పిల్ల? కవలలు?

ఈ రోజు బజార్లో కొనుక్కొచ్చిన పంపర పనస కాయ పైన తొక్క తీసి శుభ్రం చేసేసరికి, లోపల ఇదిగో ఇలా ఉంది చూడండి .దీన్ని ఏమనాలి?తల్లీ పిల్ల అనాలా? కవలలు అనొచ్చా? వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే జన్యుపరమైన లోపాలు వలన ఇలా జరుగుతుంది ,అంటారు.చూడ్డానికి మాత్రం భలే ఉంది .రెండు ఫోటోలు తీసుకొన్నాక, మేం శుభ్రంగా గుటకాయస్వాహా చేసేసాం.

4 Comments

  1. జన్యులోపాలవలన ఇలా జరుతున్నాయని శాత్రవేత్తలు చెబుతున్నారు కదా! ఇది అసహజం, కవలలు కూడా కాదు, తల్లి, పిల్ల అసలు కాదు. మన జాగ్రత్తకోసం ప్రకృతి హెచ్చరిక ఇది. ఇటువంటివి తింటే ఆలోపాలు మనకు సంక్రమిస్తాయేమో

    Like

  2. అవును బాబాయ్ గారూ ! మా చిన్నప్పుడు జంట అరటిపళ్ళు తింటే ,కవలపిల్లలు పుడతారని,పెద్దవాళ్ళు తినవద్దని చెప్పేవారు .ఈ మధ్యనే ఏదో బ్లాగులో చదివాను ,అవన్నీ అపోహలు ,తినవచ్చనీను.అయినా ఈ వయసులో ఇంకా జన్యుపరమైన సమస్య లు ఏమీ రావులే,అన్న ధైర్యంతో తినేసాము. నా టపాలు చదువుతూ ,ఓపికగా వ్యాఖ్యలు పెడుతున్నందుకు సంతోషం !

    Like

Leave a reply to Anonymous Cancel reply