అనుకోని అతిథి .

ఈ రోజు ఉదయాన్నే ఈ అరుదైన ,అందమైన ,అనుకోని అతిథి మా పెరట్లోని కొబ్బరిచెట్టు మీద వాలి ,టక్ టక్ మంటూ ,శబ్దాలు చేస్తుంటే చూసి గబగబా లోపలికి పరిగెత్తాను tab తీసుకునిరావడానికి. నేను నాలుగు ఫోటోలు తీసుకొనేలోపే అది నాలుగంగల్లో ఎంత పైకి ఎక్కేసిందో చూడండి.వడ్రంగి పిట్ట అనుకుంటున్నాను .

20 Comments

  1. బాబాయ్ గారూ !నమస్తే !బావున్నారు కదా? ధన్యవాదాలు ,చెప్పాను కదా! మీ compliments మా వారికే చెందుతాయి.

    Like

  2. వడ్రంగి పిట్టల్ని చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూసేవాళ్ళం. ఇప్పుదు ఎంతో అరుదైపోయాయి. మంచి ఫోటోలు పెట్టారు నాగరాణీగారు.

    Like

  3. మీ బ్లాగు చాలా బాగుందండీ. పువ్వులు, ఆకులు, మంచి ఫొటో లతో మీ బ్లాగు కళ కళ లాడుతుంది.మీ పోస్ట్ లన్నీ ఉదయం 5.15 కి మొదలు పెట్టి 6.30 వరకు మొత్తం చదివేసాను.చాలా బాగున్నాయి.

    Like

  4. కిషోర్ వర్మ గారూ !ధన్యవాదములు. నిజానికి నాకు ఫోటోలు తీయడం సరిగ్గా రాదండీ, అది వెళ్లిపోతుందేమోనన్న తొందర్లో ఏదో హడావిడి గా నొక్కేసాను. మా పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టు మీదకు రాత్రి పూట పునుగు పిల్లి వచ్చి కాయలు కోసుకొని తింటుంది. ఈసారి దాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తాను .

    Like

  5. నమస్తే చిత్రలక్ష్మన్ గారూ !నా బ్లాగు కు స్వాగతం .నా బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషం .అంత సమయం వెచ్చించి పోస్టు లన్నీ ఒకేసారి చదివేసి బాగుందని చెప్పినందుకు ఇంకా సంతోషం గా ఉంది .మీ పేరు క్లిక్ చేయగానే open అయిన మీ blog చూసి నేను ఆశ్చర్య పోయాను .ఎందుకంటే మీ బ్లాగు మొదలైనప్పుటి నుండీ ప్రతీ పోస్టు చదువుతూ నే ఉన్నాను.ఈ అమ్మాయెవరో కానీ చక్కగా వ్రాస్తుంది అనుకున్నాను ఎప్పుడూ కామెంట్ పెడదామని అనుకుంటుంటాను,కొంచెం బిజీ ,కొంచెం బధ్ధకం అన్నమాట .నాన్న పోస్ట్ చదివిన తర్వాత కళ్లు చెమర్చాయి.thank you.

    Like

  6. చాలా బాగున్నాయి. మీ బ్లాగులో వడ్రంగి పిట్టలని సరిచేసి నా బ్లాగులో పెట్టేను చూడండి.

    Like

  7. బాబాయ్ గారూ నమస్తే . ఫోటోలు బాగున్నాయన్నారు,సంతోషం. నా పొరపాటును సరిచేసి ,మీ బ్లాగులో పెట్టినందుకు,మరీ మరీ సంతోషం .మీలాంటి పెద్దల బ్లాగులో ,నా బ్లాగు పేరు చోటుచేసుకున్నందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది .

    Like

  8. అంజలి గారూ !నా పోస్టు నచ్చినందుకు thanks. మీరు తరచుగా వ్రాస్తూనే ఉన్నారు ,అయినా blogs చూడటం రావటంలేదంటారేమిటండీ? మీ పోస్టు లు నేను చదువుతూ నే ఉంటాను.బావుంటాయి.

    Like

  9. వద్రంగిపిట్టని చూసి ఎన్నో సంవత్సరాలు ఐంది . మీరు చూపించినందుకు ధన్యవాదాలు

    Like

  10. మీ 'అనుకోని అతిధి' వీరయి ఉంటారు, black-rumped flameback (lesser golden-backed woodpecker) – అం'తరంగం'

    Like

Leave a reply to sarma Cancel reply