పిట్ట పిల్లలు బయటకు వచ్చేసాయి .

ఇందుమూలముగా మీకందరికీ తెలియచేయునదేమనగా మా పెరట్లో నారింజ చెట్టుకు ,గూడు కట్టి ,నాలుగు గుడ్లు పెట్టిందో బుజ్జిపిట్ట .గుడ్లు చూపాను మీకు  గత టపాలో . పిల్లలని కూడా చూపిస్తానని మాట ఇచ్చాను మీకు .హమ్మయ్య! నా మాట నిలుపుకొని పిట్ట పిల్లల్ని మీ ముందు పెట్టేశా!చూసేయండి గుడ్లు పెట్టిన వారం రోజులకు పిల్లలు కనిపించాయి .కానీ పాపం !వెంటనే ఫోటో తిీయడానికి మనసొప్పలేదు .5రోజులు అయిన తరువాత తీసాము .ఈలోపు గట్టిగా గాలి వీచినా,వర్షం పడినా,అవి ఎక్కడ క్రింద పడిపోతాయేమోని భయం . రోజులో నాలుగైదు సార్లు వాటిని చూడటం,అదీ తల్లి లేని సమయంలో . అలికిడి అయితే చాలు ఆహారం కోసమేమో మరి నోరు ఎట్లా తెరుస్తున్నాయో చూసారుగా!వాటి తల్లిదండ్రులకు ఇంక అదే పని   .ఆహారం ముక్కున కరుచుకొని తెస్తూనే ఉంటాయి ,పెడుతూనే ఉంటాయి . ఇంకొక 4రోజుల్లో రెక్కలొచ్చి ఎగిరిపోతాయనుకుంటున్నాము .మా కేండీ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళకుండా కాపలా కాస్తున్నాను .పాపం అది గూడు తక్కువ ఎత్తులో కట్టింది .అందుకే ఫోటోలు బాగా తీసేసాం .ఏమైతేనేం! పది రోజులుగా మాకు మంచి కాలక్షేపం .
.

11 Comments

  1. బాగున్నాయి, గూడు, గుడ్లు, కూనలు. జాగ్రత్తగా పెంచి వాటి పిల్లల్ని కూడా చూపించాలి మరి.

    Like

  2. ధన్యవాదాలు జయ గారూ ! తల్లీ పిల్లల్ని చూసారు . ఇంకా మనవల్ని కూడా చూడాలని మీ కోరిక . సరేనండీ!వేచిఉందాం మరి .

    Like

  3. మీ ఓపికకి, శ్రద్దగా ఫోటోలు తీసి చూపినందుకు అభినందనలు. భలే ముచ్చటగా ఉన్నాయి . రాణి గారు థాంక్ యూ సో మచ్ !

    Like

  4. ధన్యవాదాలు మల్లి గారూ .జాగ్రత్తగానే చూస్తూఉన్నాము .ఇంకొక 4,5రోజుల్లో ఎగిరిపోతాయి లెండి .

    Like

  5. ధన్యవాదాలు వనజ గారూ .నాటపాలు చూస్తున్నందుకు,స్పందిస్తున్నందుకు .ఈ సారి న కంటే ముందే మా అబ్బాయి ఫోటోలు తీసి ,నాకు శ్రమ లేకుండా .చేసాడు .

    Like

  6. నమస్తే రాధిక గారూ .నా బ్లాగు లు చూసి స్పందించినందుకు ధన్యవాదాలు . నేను ఏప్రిల్ లో బ్లాగులు చూడటం మొదలు పెట్టినపుడు,మొదటి సారి వ్యాఖ్య పెట్టింది మీరు పసుపుపూలు పెట్టిన బ్లాగుకే .గాంధీనగరం అంటే ఎక్కడా అని కూడా అడిగాను . నా ప్రశ్న .మీకు .చేరలేదేమో,జవాబు రాలేదు .నా మీ బ్లాగు .నచ్చుతుంది

    Like

  7. రాణి గారు చూడలేదనుకుంట అండి . మా ఊరు గాంధీనగరం దేవరపల్లి , నల్లజర్ల ఊరు పేర్లు ఎప్పడైనా విన్నారా? వాటికి మధ్యలో ఉంటుంది .బాగా చిన్న ఊరు అందరికి తెలియదు.నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలండి .

    Like

Leave a reply to రాధిక(నాని ) Cancel reply