సన్నజాజులోయ్!

మా పెరట్లోని సన్నజాజి ,విరజాజి డాబా మీద ఎట్లా విరగబూసాయో చూడండి . బుట్టలోవి విరజాజులండీ .చెట్టు నిండుగా పూసినవేమో సన్నజాజులు .వాటిని చెట్టు .నుండి బుట్టలోకి చేర్చడం నా వల్ల  కాక వదిలేసాను .ఎటూ వదిలేసాను కదా అని పొద్దున్నే డాబా పైకెక్కి ఫోటో .తీసాను ,మీ అందరికీ చూపిస్తే ఓ పనైపోతుంది కదాఅని!పూలంటే ఎంత ఇష్టమైనా రోజూ తెంపాలంటే విసుగే కదండీ . మొగ్గలు కుంకుమరంగులో ఉండి చక్రాల్లా పెద్దగా ఉన్నవేమో, సెంటుజాజి . ఇక ఎర్రగా ఉన్నవేమో కాశీరత్నాలు   ..అవి చాలా నాజూకండీ .చెట్టు మీద ఉన్నంతసేపే వాటి అందం .త్వరగా వాడిపోతాయి డైటింగ్ చేసే అమ్మాయి లాగా .
.

20 Comments

  1. ఎన్ని పూలో, చాల మొక్కలు పెంచుతున్నారు. Keep it up. కాశీరత్నం నాకు చాల ఇష్టమైన పువ్వు. And thanks for visiting my blog and for commenting nice words.

    Like

  2. ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ !నా బ్లాగు చూసినందుకు,పూలు నచ్చినందుకు .నేను కూడా మీ వంటా వార్పూ చూశాను .అన్నీ డిఫరెంట్గా బావున్నాయి . ప్రయత్నించి చూడాలి .

    Like

  3. ధన్యవాదాలు రాణీ గారూ .పిల్లలు పెద్దవాళ్ళైపోయారు . కావలసినంతంత ఖాళీ ,మొక్కలతోనే కాలక్షేపం . బ్లాగులో .కూడా మొక్కలు పూలు ఎక్కడ కనబడతాయా అని వెతుకుతూ ఉంటాను .

    Like

  4. ధన్యవాదాలు జయ గారూ . మీ వ్యాఖ్య బాగుంది . మీరు మా బుజ్జి పిట్టల్ని చూసారా ?చూడకపోతే దీని ముందు టపా చూడండి .

    Like

  5. ధన్యవాదాలు పద్మార్పిత గారూ . దీనికి ముందు టపా చూడండి .బుజ్జిపిట్టలు మీకు చాలా నచ్చుతాయి . నేనూ మీ కవితలు చదువుతాను కానీ వ్యాఖ్యలు రాసేంత పరిజ్ఞానం లేదండీ .మీ కవితలు బావుంటాయి

    Like

  6. స్వాగతం తృష్ణ గారూ నా బ్లాగు లోనికి, చాలా పూలు పూస్తున్నాయండీ .రాత్రి10 గంటల తరవాత ఇంటి బైట నిలబడితే మంచి సువాసన ఇంట్లోకి రావాలని అన్పించదు .మీరు ఎక్కడుంటారో చెప్పండీ, సన్నజాజుల మాల తెచ్చిచ్చేస్తాను .

    Like

  7. కనులకింపుగా ఉన్నాయి..ఎంత చక్కగా పెంచుతున్నారో…very nice pic

    Like

  8. ధన్యవాదాలు అనూ గారు .మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి,పూలు పార్శిల్ చేసేస్తాను .

    Like

Leave a comment