వారం రోజుల క్రితం కొన్న మొక్కజొన్న పొత్తుల్ని ఈరోజు టిఫిన్ రూపంలోకి మార్చేసాను.ముదిరిపోయి ,ఎండిపోయిన, వాటిని,నోట్లో వేసుకొని కష్టపడటం కంటే ,రోట్లో వేసి రుబ్బేయడం నయమన్పించింది.[రోలు అంటే మిక్సీ అని మీరు అర్థం చేసుకోవాలంతే.] ఎండినవే కాబట్టి ఒలుచుకోవడం సులువే.రెండు పొత్తుల్ని గింజలు ఒలిచి,రాత్రి నానబెట్టి పొద్దున్నే నాలుగు పచ్చిమిరపకాయలు ,చిన్నఅల్లంముక్క వేసి మెత్తగా రుబ్బేసి,కమ్మదనం కోసం రెండు చెంచాల శనగపిండి,కరుకుదనం కోసం రెండు చెంచాల బియ్యప్పిండి ,రుచి కోసం కాస్త ఉప్పు ,జీలకర్ర వేసుకుని గరిటజారుగా కలుపుకుంటే మొక్కజొన్నల దోశల పిండి సిధ్ధం.నూనె వేసి కాల్చుకుంటారో,నాన్ స్టిక్ పెనం మీద వేసుకుంటారో ఇక మీ ఇష్టం .ఈ కొలతలతో 5లేదా6 దోశలు అవుతాయి .నిజ్జంగా ఇది నా సొంత ప్రయోగం .మీక్కూడా నచ్చే తీరుతుంది.ప్రయత్నించండి.
మొక్కజొన్న దోశలు.
what an idea aunty.chustune noru uudipothundi.
LikeLike
ఇదే కాంబినేషన్ తో పకోడీలు అదుర్స్. మేము రెండూ చేసుకుంటామోచ్!
LikeLike
thank you sahana.మా ఇంటికి రా!చేసిపెడతాను.
LikeLike
నమస్కారమండీ.ధన్యవాదములు,నా ప్రతీ బ్లాగు చూస్తూ కామెంట్ చేస్తున్నందుకు. ఎంతైనా మీరు పెద్దలు ,మాకన్నా ముందే ఉంటారు .నేనూ ఈసారి పకోడీలు ప్రయత్నిస్తాను.
LikeLike
will try this one. నేను మొక్కజొన్న వడలు వేస్తూంటానండి.. ఈసారి ట్త్రై చేసి చూడండి.. బాగుంటాయి.http://ruchi-thetemptation.blogspot.in/2013/02/blog-post.html
LikeLike
నిన్న ఆదివారం కదండీ !మొక్కజొన్న వడలు వేసాను.బావున్నాయండీ.ధన్యవాదాలు తృష్ణగారూ.
LikeLike