మీకు తెలుసా ?

భార్య _భర్త   , పతి _పత్ని, మొగుడు-పెళ్ళాం, శ్రీమతి __శ్రీవారు, గృహిణి_-గృహస్థు, ఇంటాయన-ఇంటావిడ, ఇల్లాలు-???
కష్టేఫలే మాష్టారు వారి భార్య ను ప్రస్తావిస్తూ ,ఇల్లాలు అంటారు.నాకెందుకో హఠాత్తుగా ఇల్లాలు కు వ్యతిరేక పదం ఏమిటా అని ఎంత ఆలోచించినా గుర్తు  రాలేదు.ఊరికే నాలో నేనే గుంజుకొనే బదులు ఎవర్నైనా అడిగేస్తే పోలా!అనకుంటూ మిమ్మల్ని అడిగాను .చెబుతారుగా?

5 Comments

  1. ధన్యవాదాలు సరేష్ బాబు గారూ ! వ్త్యతిరేకపదాలు అనేమాట తప్పేమో అన్న సందేహం తోనే వాడాను. జంట పదాలు ।అన్న మాట గుర్తు రాలేదు,ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న తెలుగు కదా !మర్చిపోయిన మాటను గుర్తు చేసారు .మరొక్కసారి ధన్యవాదాలు .నా బ్లాగుకు స్వాగతం .నేను మీబ్లాగు చూసినట్టు గుర్తు లేదు.చూస్తాను.Typed with Panini Keypad

    Like

  2. అదేనండి ఇల్లాలి గొప్పతనం. దీనికి జోడీ మాట దొరకడం కష్టం, ఇల్లాలు మాత్రం ముచ్చటగా, మురిపంతో ”మావారు” అంటే అందం చూడండి. 🙂

    Like

  3. నమస్కారం మాష్టారు !ఈ టపా పెట్టినపుడు చాలా రోజులు నేను ఎదురు చూసాను,మీనుండి జవాబు కోసం .స్తీలను ఇంతగా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు .అమ్మ గారు అదృష్టవంతులు.

    Like

  4. నాకు తెలిసి – ఇల్లాలు అంటే ఇల్లు + ఆలు; ఆలు-మగ ఉంటుంది కదండీ.మీరు పైన పేర్కొన్న వాటిల్లో ఆలు-మగ లేదు గమనిస్తే.కాబట్టి నేను ఇల్లాలుకి జంట పదం మగగా భావిస్తున్నాను. వినసొంపుగా లేదు కాని నా ఊహకి ఈ ప్రయోగం సరి అయినదే అనిపించింది.

    Like

Leave a reply to Explorer Cancel reply