ఇదేమిటో చెప్పగలరా?

నమస్తే అండీ! అందరూ బావున్నారు కదా! చాలా రోజులైపోయింది ఇటు వైపు వచ్చి,అందుకే అందర్నీ ఒకసారి పలకరించి పోదామని ,ఈ ఫోటో , ఇంకా ప్రశ్న కూడా. ఇంతకీ ఫోటో లో ఉన్నదేమిటో చెప్పండి.

14 Comments

  1. సొర చేప ఎముక పక్కల ముళ్ళులా ఉంటాయి, మంత్రం వేసేందుకు వాడేవారు.

    Like

  2. కాదండీ! ఆ కాయ పైన తొక్క పసుపు గా ,లోపల తెల్లగా ఉంటుంది . ఇప్పుడు చెప్పేస్తారు లెండి .

    Like

  3. అయ్యయ్యో! మీరు fail కావడమేంటండీ, ఒక్కసారి పిన్ని గారి సహాయంతో ప్రయత్నం చేయండి బాబాయ్ గారూ!

    Like

  4. ఇద్దరం ఉమ్మడిగా, ఏకీభావంతో విఫలమయ్యాం.అన్నట్టు మేమిద్దరం ఒకటే కదా! 🙂

    Like

  5. ధన్యవాదాలు బాబాయ్ గారూ ! ఈ సంభోధన మీకు అభ్యంతరం లేదు కదండీ !మీరిద్దరూ ఒకటే కానీ ,వంటింటి సామ్రాజ్యం లో పిన్ని గారు 'కొంచెం'ఎక్కువ కదండీ ! అది దోసకాయ లో గింజలు పట్టుకుని ఉండే భాగం .దోసకాయలో గింజలు తినరు మా ఇంట్లో .కాయ కోసి, ఆ భాగాన్ని ప్రక్కకు విసిరితే ,అది తిరగబడి అట్లా కనబడింది. వెంటనే నాకే అర్థం కాలేదు .చాలా రోజుల విరామం తరువాత బ్లాగులో ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్న నాకు కోతికి కొబ్బరి కాయ దొరికినట్లైందన్నమాట.మరొక్కసారి ధన్యవాదాలు .

    Like

  6. బాయ్! పిన్నీ!! ఈ సంబోధన అభ్యంతరం లేదు కదండీ! ఎంతమాటన్నావు తల్లీ! ఆత్మీయులను చేసుకుంటానంటే అంతకంటే ఆనందమా!!! చాలా అనందం అమ్మాయి, నిజం చెప్పద్దూ, చాలానే ఆలోచించాం కాని కుదరలేదు, అది ఇలా దోసగింజల తొక్కు అని ఊహించలేకపోయాం. దానికి తోడు అది పక్కన ముళ్ళలా ఉండటం మరికాస్త గందరగోళపరచింది. 🙂

    Like

Leave a reply to as Cancel reply