మా పదిహేడు రోజుల ప్రయాణం _1

దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్  రాష్ట్రం లో గల చార్ధామ్ యాత్ర  చేయాలని , మావారు, స్నేహితులు ,వాళ్ళ కుటుంబాల తో కలసి మొత్తం 17 మందిమి ఢిల్లీ వెళ్ళే తెలంగాణా ఎక్సప్రెస్ ఎక్కాము, సికింద్రాబాద్ స్టేషన్ లో.మర్నాడు ఉదయాన్నే 9_గంటలకు ఢిల్లీ లో ట్రైన్ దిగి ,సుమారు 5గంటలు వెయిటింగ్ హాల్లో నిరీక్షణ.8పైగానే acలు పనిచేస్తున్నా, విపరీతమైన రష్ కారణంగా ,ఢిల్లీ ఎండల్ని ఆ వెయిటింగ్ హాల్లో నే ఎంజాయ్ చేసేసాము.మాతో సహా అందరి దగ్గరా చాలా చాలా లగేజ్.కాలు కదపలేని పరిస్థితి .అతి కష్టం మీద అక్కడ కూర్చుని , మరికాస్త శ్రమతీసుకొని ఆ పద్మవ్యూహం లోంచి బైటపడి , డెహ్రాడూన్ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కాము, మధ్యాహ్నం 3గంటలకు.6గంటల ప్రయాణం తర్వాత ,రాత్రి9గంటలకు హరిద్వార్ లో దిగాము.స్టేషన్కు దగ్గరగా , గంగానది ప్రక్కనే ఉన్న చింతామణి ఆశ్రమం లో బస.ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేశారు , హాయిగా గదుల్లో చేరిపోయాం.పదిహేడు రోజుల్లో ,మొదటి రెండు రోజులు ప్రయాణం చేసి హరిద్వార్ చేరుకున్నామన్నమాట.కొంచెం బోర్ గా ఉందాండీ?తరువాత టపాలో ఫోటోలు పెడతానులేండి.

5 Comments

  1. నమస్తే, నా పేరు కిశోర్. హైదరాబాద్ లో ఉంటాను. జులై నెలాఖరులో హరిద్వార్ వెళ్ళాలనుకుంటున్నాము; సరిగ్గా ఈ సమయంలోనె మీ పోస్ట్ చూడడం జరిగింది. మీరు చెప్పిన చింతామణి ఆశ్రమం ఎలా ఉంది? ఏ ఇబ్బందులు లేవు అనుకుంటే మేము కూడా అక్కడే బస చేస్తాము. దయచేసి మీ అభిప్రాయం తెలుపగలరు.

    Like

  2. నమస్తే కిశోర్ గారూ , చింతామణి ఆశ్రమం బాగానే ఉంటుంది , పర్లేదు ,సామాన్యంగా ఉంటుంది .స్టేషన్,గంగానది, చాలా దగ్గర .డబుల్ బెడ్ రూమ్ 400రూ.ఎదురుగా ఇడ్లీ దొరుకుతుంది .ప్రక్క వీధిలో రాజమండ్రి వా అన్నదాన సత్రం ఉంటుంది .భోజనం బాగుంది .చింతామణి contact no 01334 227900, 220110, 9897106563, 9758975728 rakesh malhotra.

    Like

  3. నాగ రాణి గారు హరిద్వార్ గొప్ప పుణ్య భూమి మా నాన్న గారు చెపుతుంటే చిన్నప్పుడు ఆకతాయితనంగా ఉండేదండి. కానీ నాకు తెలిసి దాదాపుగా మీతో కలిపి 400 నుండి 500 కుటుంబాలు వెళతాం గమనించాను.ప్రస్తుతం నాకు కూడా హరిద్వార్ చూడాలనే కోరిక బాగానే ఉన్న సెలవులు దొరకని పరిస్థితి.మీరు నెక్స్ట్ పోస్ట్ లో ఫోటో లు పెడతానన్నారు.కొంచెం మర్చి పోకుండా ఫోటో గ్రాఫ్స్ పోస్ట్ చెయ్యండి. అలాగే నా గురించి,నా పేరు ch .అజయ్ కుమార్,మాది కృష్ణ జిల్లా విజయవాడ, నాకొక ఇంటర్నెట్&వెబ్ టెక్నాలజీస్ బ్లాగ్ ఉంది. దాని పేరు AP WEB ACADEMY .ఈ బ్లాగ్ లో నేను ముఖ్యంగా వెబ్ సైట్స్,బ్లాగ్స్ బిల్డ్ చేయటం, వాటిని మైంటైన్ చేయటం మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వాజెస్ ఐన HTML CSS జావాస్క్రిప్ట్,మై SQL ,PHP మొదలైన వాటి గురించి ,మరియు హాకింగ్ గురించి,కంప్యూటర్ మొబైల్ టిప్స్ గురించి ఆర్టికల్స్ ప్రెజెంట్ చేస్తాను.దయ చేసి నా బ్లాగ్ ని విసిట్ చేసి మీ విలువైన సలహాలు తెలియ చేయగలరు.నా వెబ్సైటు అడ్రస్:- https://apwebacademy.com థాంక్ యు సో మచ్

    Like

  4. నమస్తే అజయ్ కుమార్ గారూ!ఫోటోస్ తప్పకుండా పెడతానండీ.నేనొక సామాన్య గృహిణినండీ! మీ బ్లాగు చూస్తాను కానీ, సలహాలు ఇచ్చేంత సాంకేతిక పరిజ్ఞానం లేదండీ నాకు.

    Like

Leave a comment